Feb 25,2023 21:22

మాట్లాడుతున్న టిడిపి నాయకులు కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి

మాట్లాడుతున్న టిడిపి నాయకులు కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి
'కొడాలి'కి రాజకీయ బిక్ష పెట్టింది టిడిపి
నెల్లూరు:లారీ క్లీనర్‌ గా ఉన్న కొడాలినానికి రాజకీయ బిక్ష పెట్టి ఒక గుర్తింపు తీసుకొచ్చింది టిడిపి అని ఆ పార్టీ నగర ఇన్‌ఛార్జి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం నగరంలోని టిడిపి జిల్లా కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబునాయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నానిపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.. నాని చేసిన వ్యాఖ్యలను సుమోటాగా తీసుకుని అతనిపై హత్యాయత్నం కేసు నమోదు చెయ్యాలని కోటంరెడ్డి డిమాండ్‌ చేశారు.. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబునాయుడు మీద, లోకేష్‌ మీద కొడాలి నాని పిచ్చి పట్టిన కుక్కలాగా వాగుతున్నాడని మండిపడ్డారు.. కొట్టుకోవడానికి నల్లమల అడవుల్లో ఎందుకని.. కొడాలి నానికి దమ్ముంటే విజయవాడ బెంజి సర్కిల్‌ కు రమ్మని సవాల్‌ విసిరారు. తమ నాయకుడు సైగ చేస్తే కొడాలి నాని అంతుచూస్తామంటూ హెచ్చరికలు చేశారు.టిడిపి నేతలు ఉమ్మివేస్తే అందులో కొడాలి నాని కొట్టుకుపోతాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్‌ వివేకా కేసులో సీఎం జగన్‌ ప్యామిలీకి చుట్టుకోవడంతో ఆ అంశం నుంచి ప్రజలను డైవర్టు చేసేందుకే చంద్రబాబును రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడన్నారు.
అబ్బాయి కిల్డ్‌ బాబారు.. అనేది ప్రజలందరికీ తెలిసిన విషయమని, వైఎస్‌ జగన్‌ త్వరలోనే జైలుకు వెళ్లబోతున్నాడని జోస్యం చెప్పారు. అధికారంలో వైసిపి ఉంటే సిబిఐని ప్రతిపక్ష హౌదాలో ఉన్న చంద్రబాబునాయుడు మేనేజ్‌ చేస్తున్నాడని ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ ఆరోపణలన్నీ భయంలో వచ్చే మాటలేనంటూ కొటంరెడ్డి వ్యాఖ్యానించారు.. ఏడాది తర్వాత వైసిపి నాయకులకు , వారికి సపోర్టు చేసిన పోలీసు అధికారులకు తమ సత్తా ఏంటో చూపిస్తామన్నారు.చంద్రబాబునాయుడి మీద ఈగవాలినా.. వైసిపి నాయకులు ఒక్కరూ మిగలరంటూ కోటంరెడ్డి తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్లు ఉచ్చి భువనేశ్వర్‌ ప్రసాద్‌, కేవీ చౌదరి, అబ్దుల్‌ మస్తాన్‌, పెంచలబాబూ, బూబూ గౌడ్‌, గోపాల్‌, సాయిరాం తదితరులు పాల్గొన్నారు.