Nov 15,2023 23:28

నివాళులర్పిస్తున్న ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని తదితరులు


ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్‌
పిడిసిసి బ్యాంకు మాజీ ఛైర్మన్‌ కండే శ్రీనివాసరావు తల్లి మంగమ్మ చిరస్మరణీయురాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. కండే మంగమ్మ ఆదరణ స్తుతి కూడిక త్రోవగుంటలోని కండే శ్రీనివాసరావు స్వగహంలో బుధవారం జరిగింది. ఈ సందర్భంగా మంగమ్మ సేవలను పలువురు వక్తలు కొనియాడారు. ఆమె మృతి తీరని లోటని, కండే శ్రీనివాసరావు కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆమె చిత్రపటానికి మాజీ మంత్రి, ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి, వైసిపి యువ నాయకులు బాలినేని ప్రణీత్‌ రెడ్డి, ఒంగోలు నగర పాలక సంస్థ మేయర్‌ గంగాడ సుజాత, టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు దామచర్ల జనార్ధన్‌రావు, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, మాజీ జడ్పీ చైర్మన్‌ నూకసాని బాలాజీ, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ మంత్రి శ్రీనివాసరావు, కామేపల్లి శ్రీనివాసరావు కార్పొరేటర్లు అంబటి ప్రసాదు, బెంగళూరు నరసయ్య, మాజీ కాయర్‌ బోర్డు సభ్యులు కెపిఎస్‌ రత్నరాజు, కట్టా గోపి, యడవల్లి సాంబయ్య, పిడిసిసి బ్యాంక్‌ సిఇఒ వై.ప్రకాష్‌ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.