నామినేషన్ పత్రాలు అందజేస్తున్న కంచర్ల శ్రీకాంత్
ప్రజాశక్తి -కందుకూరు తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కంచర్ల శ్రీకాంత్ నామినేషన్ గురువారం చిత్తూరు కలెక్టరేట్‌లో నామినేషన్ దాఖలు చేశారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర, చిత్తూరు జిల్లా టిడిపి అధ్యక్షులు పులివర్తి నాని, ఎంఎల్‌సి దొరబాబు, మాజీ ఎంఎల్‌సి గౌనివారి శ్రీనివాసులు, మాజీ మేయర్ కటారి హేమలత, కందుకూరు నియోజకవర్గ టిడిపి ఇంచార్జి ఇంటూరి నాగేశ్వరావు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య, రాష్ట్ర తెలుగుయువత అధికార ప్రతినిధి గొట్టిపాటి హరికష్ణ తదితరులు హాజరయ్యారు.










