మిత్రులతో కలసి ఊయల ఊగుతున్న మాజీ మంత్రి రఘువీరారెడ్డి
ప్రజాశక్తి మడకశిర రూరల్ : మండలంలోని నీలకంఠాపురం గ్రామంలోని హై స్కూల్ వద్ద మాజీమంత్రి రఘువీరారెడ్డి కళాశాల మిత్రులతో ఆదివారం సరదాగా కాసేపు గడపారు. తనతో పాటు మడకశిర పట్టణ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివిన మిత్రులతో కలిసి నీలకంఠేశ్వర స్వామి దేవాలయం వద్ద ఉయ్యాలు ఆడుతూ సరదాగా గడపారు. పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. మిత్రులు క్షేమ సమాచారం తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా మాజీమంత్రి రఘువీరా మాట్లాడుతూ పూర్వ మిత్రులతో కలవడం సంతోషంగా ఉందని అన్నారు.










