ప్రజాశక్తి-నందిగామ
ఆదానీలు, అంబానీలు హొకార్పొరేట్లకు ఊడిగం చేస్తూ హొప్రజలపై భారాలను మోపుతున్న కేంద్ర ప్రభుత్వ విధానాల్ని తిప్పికొట్టాలని ఎన్టీఆర్ జిల్లా సిపిఎం కార్యదర్శి డివి కష్ణ పిలుపునిచ్చారు. శుక్రవారం నందిగామ గాంధీ సెంటర్లో హొసిపిఎం బందం ఆధ్వర్యంలో కరపత్రాలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా డివి కష్ణ మాట్లాడుతూ ప్రత్యేక హౌదా, విభజన హామీల అమలుల్లో రాష్ట్రాన్ని దగా చేసిన మోడీ సర్కారును హొనిలదీయాలని డివి కష్ణ కోరారు. 8 సంవత్సరాల బిజెపి మోడీ పాలనలో దేశం అన్ని రంగాల్లో అధోగతి పాలయిందని, నిత్యవసర వస్తువులు ధరలు చుక్కలు అంటుతున్నాయనన్నారు. బియ్యం, పాలు, నూనెలు, పప్పు దినుసులతో సహా అన్ని వస్తువులు పైన జీఎస్టీ పేరుతో భారం మోపారన్నారు. హొవంట గ్యాస్, సిలిండర్ ధర 1100 దాటిందన్నారు. పెట్రోల్, డీజిల్ రేట్లు ఇష్టారాజ్యంగా పెంచి 27 లక్షల కోట్లు ప్రజల నెత్తిపై రుద్దారని పేర్కొన్నారు. హొప్రభుత్వ రంగ సంస్థలైన రైల్వే, ఎల్‌ఐసి, బ్యాంకింగ్, బిఎస్‌ఎన్‌ఎల్‌తో సహా అన్నింటిని ప్రైవేటీకరించి కార్పొరేట్లకు కట్టబెడు తున్నారని హొఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదానీలు, అంబానీలకు కోర్టులు, విమానాశ్రయాలు, టెలికాం, విద్యుత్తు ఇలా ఒక్కొక్కటి దార దత్తం చేస్తుర న్నారు. బడా కార్పొరేట్లకు 10 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారని, హొచిన్న, మధ్య తరగతి పరిశ్రమలని దెబ్బతీశారని తెలిపారు. రిటైల్ వ్యాపారం లోకి విదేశీ, కార్పొరేట్ కంపెనీలను అనుమతించి చిరు వ్యాపారం నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యవసర వస్తువు దారులు తగ్గించాలని , రేషన్ డిపోల ద్వారా నాణ్యమైన సరుకులు ఇవ్వాలన్నారు. వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను 2014 నాటి స్థాయిలో తగ్గించాలన్నారు. లేబర్ కోడ్ లను రద్దు చేయాలన్నారు. అసంఘటిత కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ హొఆపాలన్నారు. హొఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు చనుమోలు సైదులు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు ఎం. సోమేశ్వరావు హొ, సిపిఎం నందిగామ కార్యదర్శి కే గోపాల్, కమిటీ సభ్యులు సయ్యద్ ఖాసిం, కర్రి వెంకటేశ్వరావు, జి గోపి నాయక్, ఎం శ్రీనివాసరావు, బచ్చలకూర లాజరు పాల్గొన్నారు.










