కార్మికులకు గుర్తింపు కార్డులు పంపిణీ
ప్రజాశక్తి-ఉదయగిరి : భవన నిర్మాణ కార్మికులకు జిల్లా భవన నిర్మాణ కార్మిక కార్యదర్శి అల్లాడి గోపాల్ గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. ఆదివారం స్థానిక యూనియన్ రోడ్ షాదీ మందిర్‌లో భవన నిర్మాణం సిఐటియు కార్మికుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మన రంగంలో సమస్యలను మనమే పరిష్కరించుకోనే దిశగా ప్రతి ఒక్కరం సిద్ధంగా ఉండాలన్నారు. అందరి ఐక్యతతో కార్మికులకు ఎదురయ్యే ప్రతి సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. అందరూ కలిసి ఉన్నప్పుడే మన సమస్యలను పరిష్కరించుకోగలమని ప్రతి కార్మికుడు మన సమస్యల పరిష్కారానికి చేసే ప్రతి కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ ధోరణి వీడేంతవరకు ఉద్యమాలు చేసి మనకు వచ్చే ప్రతి అవకాశాన్ని సాధించుకుందామన్నారు. కార్మికుల్లో తలెత్తే సమస్యలను ఉదయగిరి భవన నిర్మాణ కమిటీ సభ్యులే బాధ్యత తీసుకొని ప్రతి కార్మికునికి అందాల్సిన బీమాలు తదితర వాటిని అందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షులు గడ్డం నాగేశ్వరరావు, సిపిఎం మండల కార్యదర్శి ఫర్ధిన్ బాషా, మండల అధ్యక్షులు షేర్ ఉస్మాల్ అలీ, ప్రధాన కార్యదర్శి బొజ్జా శ్రీనివాసులు, గౌరవఅధ్యక్షులు ఎం.సుబ్బులు, కోశాధికారి ఉదయగిరి భీమయ్య, ఉపాధ్యక్షులు షేక్ బాజి, మండ్ల రమణయ్య, కార్యనిర్వాహకులు యు.వెంకటేష్ తిరుపతయ్య, కడప ఎం.శ్రీను, జి.మురళీ, షేక్. రసూల్, వి.నారాయణ, షేక్ షబ్బీర్, షేక్ మస్తాన్, షేక్. సందాని, జి. శ్రీనివాసులు, షేక్, అహ్మదాబాషా, పి.నాగరాజు, కె.కొండయ్య తదితర కమిటీ సభ్యులు కార్మికులు పాల్గొన్నారు.










