Dec 03,2022 21:33

సమావేశంలో మాట్లాడుతున్న నాయకులు

ప్రజాశక్తి-హిందూపురం : పట్టణ వ్యాప్తంగా ఉన్న ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా రాజీలేని పోరాటాలకు సిద్ధం కావాలని సిఐటియు పట్టణ కార్యదర్శి నరసింహప్ప పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలోని కల్లూరు సుబ్బారావు పార్కులో పట్టణంలోని ఆటో కార్మికులతో సిఐటియు నాయకులు సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో కార్మికులందరు తమ సమస్యల పరిష్కారానికి సిఐటియు ఆధ్వర్యంలో పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. అనంతరం సిఐటియు పట్టణ కార్యదర్శి నరసింహప్ప మాట్లాడుతూ రోజు రోజుకు ఆటో కార్మికులపై పోలీసులు, ఆర్‌టిఎ అధికారుల వేధింపులు, దాడులు ఎక్కువ అవుతున్నాయన్నారు. కార్మికుల సంక్షేమం కోసం రాజీలేని పోరాటాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ అధ్యక్షులు జగదీష్‌, నాయకులు రామకృష్ణ, అత్తర్‌బాబా, కల్లూరు ఆటో స్టాండ్‌ అధ్యక్షులు నరేష్‌, కార్యదర్శి రఫీ, మోదా సురేష్‌, రామాంజి, అంజి, అతావుల్లా, నాగరాజు, నాగేష్‌, సునీల్‌, ఆటో కార్మికులు పాల్గొన్నారు.