ప్రజాశక్తి-భవనిపురం : విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వని సిఎం గో బ్యాక్ అంటూ సితార సెంటర్ వద్ద జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గం ఆధ్వర్యంలో బుధవారం నిరసన వ్యక్తం చేశారు. సీఎం గో బ్యాక్ నినాదాలతో నిరసన చేస్తున్న జనసేన పార్టీ కార్యకర్తలను భవనిపురం పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.










