Jul 20,2021 11:49

హైదరాబాద్‌ : తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జూరాలకు వరద ఉధృతి పెరిగింది. దీంతో అధికారులు ప్రాజెక్టు 20 గేట్లను ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. వరద ఇలానే కొన్నాళ్లు సాగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం లక్షా 35 వేల క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో వస్తుండగా లక్షా 59 వేల క్యూసెక్కులు ఔట్‌ ఫ్లోగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుత నీటిమట్టం 318.420 మీటర్లుగా ఉంది. ఇక పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టిఎంసి లు కాగా ప్రస్తుత నీటి నిల్వ 9.459 టిఎంసి లుగా ఉంది. ఈ ప్రాజెక్టులోని అన్ని యూనిట్లలో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతుంది.