Jan 19,2021 17:10

ఆలమూరు (తూర్పు గోదావరి) : ఆలమూరు మండలంలోని జొన్నాడలో యోగివేమన జయంతిని సీనియర్‌ నేత ద్వారంపూడి నాగేంద్ర సత్యనారాయణ రెడ్డి (దొరబాబు) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా వేమన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ.. వేమన రాసిన పద్యాలు యువతకు ఎంతో స్పూర్తిని ఇస్తాయని అన్నారు. అందరికీ స్వీట్స్‌ పంచారు. ఈ కార్యక్రమంలో ద్వారంపూడి అప్పారెడ్డి, నాండ్ర నాగమోహన్‌ రెడ్డి, నల్లమిల్లి రామారెడ్డి, గొలుగురి సూర్రెడ్డి, తాడి మెహెర్‌ ఆదిత్య రెడ్డి, తాడి వెంకన్నబాబు, తదితరులు పాల్గొన్నారు.