Jan 19,2023 16:17

ప్రజాశక్తి-కడియం (తూర్పుగోదావరి) : కడియం ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు టి.సత్యనారాయణ అధ్యక్షతన వేమన జయంతోత్సవం గురువారం జరిగింది. ఈ సందర్భంగా తెలుగు ఉపాధ్యాయులు జి.సత్యనారాయణ మాట్లాడుతూ.. ప్రాచీన కవులలో వేమన గొప్ప సంఘ సంస్కర్త అని, అనేక దురాచారాలపై కత్తి ఝులిపించారని, వేమన పద్యాలు రాని తెలుగు వారు ఉండరంటే అతిశయోక్తి కాదని తెలియజేశారు. ఇందులో భాగంగా విద్యార్థులకు వేమన పద్యాలపై పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. తెలుగు ఉపాధ్యాయులు పెర్సీ, శరత్‌ బాబు, గిరిజా, లెనినా, సి.హెచ్‌.సత్యనారాయణ పాల్గొన్నారు.