Jan 19,2023 15:24

ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : యోగి వేమన జయంతి సందర్భంగా వేమన రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు జొన్నాడలో గల వేమన విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవ జీవిత సత్యా, అసత్యాలను నిత్యాన్వేషణతో విమర్శించిన వివేకిగా వేమన కీర్తిగడించారన్నారు. ప్రజాకవిగా, మానవతావాదిగా వేమన చిరస్మరణీయులన్నారు. ఈ కార్యక్రమంలో నల్లమిల్లి రామారెడ్డి, తాడి తమ్మిరెడ్డి, మేడపాటి రామారెడ్డి, నాడ్ర నాగ మోహన్‌ రెడ్డి, తాడి మెహెర్‌ ఆదిత్య రెడ్డి, తాడి వెంకన్నబాబు, తాడి శ్రీనివాస్‌ రెడ్డి(బట్టిశ్రీను), తదితరులు పాల్గొన్నారు.