ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయడానికే "జగనన్నే మా భవిష్యత్తు-మా నమ్మకం నువ్వే జగనన్న" అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందని శాసనసభ్యులు మేడా వెంకట మల్లిఖార్జున రెడ్డి, జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి తెలియజేశారు. పెద్ద కారంపల్లి గ్రామపంచాయతీలోని మునక్కాయ పల్లి, రాజంపేట మున్సిపల్ పరిధిలోని ఉస్మాన్ నగర్, నారపురెడ్డిపల్లి, ఎర్రబల్లిలో మేడా, ఆకేపాటి వైఎస్ఆర్సిపి నాయకులతో కలిసి పర్యటించి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను గురించి వివరించి గత పాలనకు, జగన్మోహన్ రెడ్డి పాలనకు ఉన్న వ్యత్యాసాన్ని వివరించారు. సంక్షేమ పథకాలకు సంబంధించిన పుస్తకాలను పంపిణీ చేస్తూ చరవాణికి, ఇంటి తలుపులకు స్టిక్కర్లు అంటించి మరలా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసులు రెడ్డి, జడ్పిటిసి దాసరి పెంచలయ్య, కౌన్సిలర్ కళావతి, ఎంపీటీసీ అలుగునూరు వరదరాజు, రామ్మోహన్ నాయుడు, చికెన్ శ్రీను, చప్పిడి రఘురాం రెడ్డి, నాగేశ్వర్, నజీర్ భాష, చంద్రశేఖర్ రెడ్డి, సచివాలయ కన్వీనర్లు, కో కన్వీనర్లు, గృహసారధులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.










