Feb 25,2023 21:59

మేరిగ మురళీధర్‌ను సన్మానిస్తున్న దృశ్యం

మేరిగ మురళీధర్‌ను సన్మానిస్తున్న దృశ్యం
జగనన్న సచివాలయ కన్వీనర్ల శిక్షణ

కోవూరు:కోవూరు మండల పరిధిలోని జగనన్న సచివాలయ కన్వీనర్ల శిక్షణా కార్యక్రమం పడుగుపాడు రుక్మిణి కళ్యాణమండపం నందు శనివారం కోవూరు శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ మేరీగా మురళి కి నియోజకవర్గ శాసనసభ్యులు నాయకులు గజమాలతో ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా ప్రజలకు చేరవేయడం జరుగుతుందని సచివాలయ కన్వీనర్లు మార్చి 17వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఒక యజ్ఞంల ప్రతి ఇంటికి వెళ్లి నా నమ్మకం నువ్వే జగన్‌ అనే స్టిక్కర్‌ అందించాలని కోరారు కరుణ సమయంలోను సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరవేయడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ముందంజలో ఉన్నారని తెలియజేశారు
ఈ కార్యక్రమంలో డి ఏ ఏ చైర్మన్‌ దొడ్డం రెడ్డి నిరంజన్‌ బాబు రెడ్డి మండల కన్వీనర్‌ నలుబోలు సుబ్బారెడ్డి,పచ్చిపాల రాధాకష్ణారెడ్డి, జడ్పిటిసి కవరగిరి శ్రీలత, ఎంపీపీ పార్వతి, వైస్‌ ఎంపీపీ శివుని నరసింహారెడ్డి, రామిరెడ్డి మల్లికార్జున్‌ రెడ్డి,వైఎస్‌ఆర్సిపి పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.