Nov 25,2022 21:34

పోస్టర్లు విడుదల చేస్తున్న నాయకులు

ప్రజాశక్తి మడకశిర రూరల్‌ : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి మూడున్నర సంవత్సరాల తన పాలనలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని టిడిపి నాయకులు, మాజీ ఎమ్మెల్యే ఈరన్న విమర్శించారు. పట్టణంలోని టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈరన్న మాట్లాడుతూ లోకేష్‌ చేపడుతున్న భరోసా పాదయాత్రను వైసీపీ అవినీత పాలన అంతం చేసేందుకు వేసే తొలి అడుగుగా అభివర్ణించారు. ఈసందర్భంగా పాదయాత్ర పోస్టర్లు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వక్కలిగ సాధికార కమిటీ కన్వీనర్‌ రాష్ట్ర కన్వీనర్‌ పాండురంగప్ప, జిల్లా కార్యదర్శి రవి భూషణ్‌, రైతు విభాగపు జిల్లా అధ్యక్షులు ఉగ్ర నరసింహప్ప, మాజీ ఎంపీపీ అశ్వర్థరామప్ప, ఆదినారాయణ, గౌడన్నహల్లి కిష్టప్ప, రాజగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.