Mar 01,2023 22:46

సమావేశంలో మాట్లాడుతున్న పరిటాల శ్రీరామ్‌

ప్రజాశక్తి ధర్మవరం టౌన్‌ : ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి వల్ల అభివృద్ధి హైదరాబాదుకు వెళ్లిందని ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు, మాజీ మంత్రి పల్లెరఘు నాథరెడ్డి, ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్‌ విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పార్లమెంట్‌ పరిశీలకులు, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ధర్మవరం నియోజకవర్గ పరిశీలకులు వైకుంఠ మల్లికార్జునతో కలిసి పరిటాల శ్రీరామ్‌ టీడీపీ కార్యాలయంలో బుధవారం నాయకులు, కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పరిటాలశ్రీరామ్‌ మాట్లాడుతూ నాలుగేళ్లగా నిరుద్యోగులు, ఉద్యోగులు ప్రభుత్వం వల్ల కలుగుతున్న ఉపయోగాలను వివరించారు. ముఖ్యంగా నిరుద్యోగులు, యువత ఉద్యోగాలు లేక పెద్ద ఎత్తున వలసలు వెళ్లారన్నారు. ఈ నాలుగేళ్లలో ఒక్క పరిశ్రమ కూడా రాలేదని అలాగే ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్‌ కూడా కనిపించలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్‌ నాయకుడు చిగిచెర్ల ఓబిరెడ్డి, కమతం కాటమయ్య, పణికుమార్‌, చింతలపల్లి మహేశ్‌ చౌదరి, కుణుతూరు వేణుగోపాల్రెడ్డి, బోయ రవిచంద్ర, చింతపులుసు పెద్దన్న, పురుషోత్తంగౌడ్‌, క్రిష్ణాపురం జమీర్‌ అహమ్మద్‌, పోతుకుం టలక్ష్మన్న, అంబటిసనత్‌ గొట్లూరుశిన, మేకలరామాంజి,గోసల శ్రీరాములు,భీమనేని ప్రసాద్‌ నాయుడు ,నాగూర్‌ హుస్సేన్‌, కొత్తపేట ఆది, సాహెబ్బీ, బీబీ,పల్లపు రవీంద్ర, రాంపురంశీన, చిన్నూరువిజరు చౌదరి,బొట్టుకిష్ట కేశగాళ్లశీన తదితరులు పాల్గొన్నారు.