Feb 21,2023 21:47

ఫొటో: పోటీలు నిర్వహిస్తున్న జె వి వి నాయకులు

జెవివి ఆధ్వర్యంలో క్విజ్‌ పోటీలు
ప్రజాశక్తి-కావలి : కావలి రెడ్‌క్రాస్‌ భవనంలో జనవిజ్ఞాన వేదిక (జెవివి) కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం పాఠశాలల విద్యార్థులకు జూనియర్‌, సీనియర్‌ విభాగాలకు క్విజ్‌ పోటీలు నిర్వహించారు. కావలి పట్టణంలోని సీనియర్స్‌ 30 పాఠశాలలు, జూనియర్స్‌ 28 పాఠశాలలు నుండి స్కూల్‌కు ముగ్గురు చొప్పున విద్యార్థులు హాజరయ్యారు. జెవివి కావలి పట్టణ శాఖ, గౌరవ అధ్యక్షులు డాక్టర్‌ బెజవాడ రవికుమార్‌ అధ్యక్షులు తోట వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 28న జరిగే జాతీయ సైన్స్‌ ది నోత్సవం సంధర్భంగా వివిధ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రజల్లో ఉండే మూఢ నమ్మకాలను, తొలగించడం, విద్యార్థులలో శాస్త్రీయ విజ్ఞానం పెంపొందించడం కోసం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు.
ఇప్పటి వరకు నిర్వహించిన వివిధ పోటీలకు పాఠశాల యాజమాన్యం, తల్లిదండ్రులు తమకు అన్నివిధాలా సహకరించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. సీనియర్‌ విభాగానికి ప్రశ్నాపత్రం, కావలి రెడ్‌క్రాస్‌, సెక్రటరీ గంధం ప్రసన్నంజనేయులు, జూనియర్స్‌ విభాగానికి, జిల్లా రెడ్‌క్రాస్‌ ఇన్‌ఛార్జి చైర్మన్‌ దామిశెట్టి సుధీర్‌ నాయుడు ప్రశ్నాపత్రం రిలీజ్‌ చేశారన్నారు. సీనియర్స్‌ విభాగానికి క్విజ్‌ మాస్టర్‌గా షేక్‌ జిలానిబాషా, ఆకుల రమణయ్య, జూనియర్స్‌కు ఎస్‌.రామకృష్ణ నిర్వహించారని తెలిపారు. ఇప్పటివరకు నిర్వహించిన పోటీలలో విజేతలైన వారికి జాతీయసైన్స్‌ దినోత్సవం రోజున బహుమతులు, అందచేస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో సెక్రటరీ గాదిరెడ్డి హరనాధ్‌, జిల్లా నాయకులు ఆకుల రమణయ్య, ఉపాధ్యక్షులు, పాపిశెట్టి జానకిరామ్‌, జాయింట్‌ సెక్రటరీ ఖాదర్‌బాషా, శారదా, వెంకయ్య, జాన్‌, షేక్‌ రఫీ, రెడ్‌క్రాస్‌ భవనం, వెన్యూ ఇన్‌ఛార్జ్‌ హరినారపరెడ్డి, తదితరులు హాజరై సహకరించారు.