ప్రజాశక్తి -కందుకూరు : రాష్ట్ర స్థాయి హాకీ జట్టుకి కందుకూరు టిఆర్‌ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థిని ఎంపికైంది. 2022-2023 సంవత్సరాలకు సందర్భంగా రాష్ట్ర స్థాయి పోటీలు విశాఖపట్నం జిల్లా నక్కపల్లిలో ఈ నెల ఒకటో తేదీ వరకు జరిగాయని పిడి సుబ్బారావు తెలిపారు. ఈ పోటీలలో ప్రకాశం జిల్లా బాలికల జట్టు మూడో స్థానంలో నిలిచి బ్రాంచ్ మెడల్ సాధించింది అన్నారు. ఈ జట్టులో కందుకూరు టిఆర్‌ఎస్ కళాశాల విద్యార్థినిలు పి నందిని, వరలక్ష్మి పాల్గొన్నారు. నందిని గోల్‌కీపర్‌గా ఉమెన్ ఆఫ్ ది టోర్నమెంట్ బెస్ట్ గోల్ కీపర్‌గా అవార్డును సాధించి ప్రకాశం జిల్లా జట్టు కాంశ్య పథకం సాధించడానికి కారణం అయిందని సుబ్బారావు తెలిపారు. ఎపి జట్టుకి గోల్‌కీపర్‌గా ఎన్నిక కాబడినట్లు చెప్పారు. త్వరలో జాతీయస్థాయి అండర్ 19 హాకీ పోటీలలో పాల్గొంటున్నట్లు తెలిపారు. ఈ విద్యార్థిని కర్ణాటకలోని కోడగు జిల్లాలోని మీడికేరి స్పోర్ట్స్ అథారిటీ ఇండియా హాస్టల్లో గోల్‌కీపర్‌గా శిక్షణ పొందుతున్నట్లు చెప్పారు. నందిని, వరలక్ష్మి లను కళాశాల ప్రిన్సిపాల్ కదిరి నాగేశ్వరరావు, ఫిజికల్ డైరెక్టర్ సుబ్బారావు, సిబ్బంది అభినందించారు.










