Feb 27,2023 21:34

ఫొటో : మ్యాజిక్‌ చేస్తున్న మెజీషియన్‌

జాతీయ సైన్స్‌ దినోత్సవం
ప్రజాశక్తి-మర్రిపాడు : జాతీయ సైన్స్‌ దినోత్సవం పురస్కరించుకొని సోమవారం జన విజ్ఞాన వేదిక మండల శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో మ్యాజిక్‌ అండ్‌ మ్యూజిక్‌ కార్యక్రమాన్ని మెజీషియన్‌ చైతన్య నిర్వహించారు. ఈ సందర్భంగా జనవిజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షులు పోలయ్య మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్న మూఢనమ్మకాలను, కూల్‌ డ్రింక్స్‌పై అపోహలను, సమాజంలోని అసాంఘిక చర్యలను తొలగించేందుకు ప్రతేడాది మండలంలో కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
విద్యార్థులు సైన్స్‌పై అవగాహన కలిగి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్‌ చెన్నకేశవులు, లెక్చరర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.