ప్రజాశక్తి-ఇబ్రహీంపట్నం: కేతనకొండలోని జానెట్ జూనియర్ అండ్ డిగ్రీ కళాశాలలో ప్రేషర్స్‌డే సెల బ్రేషన్స్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థిని విద్యార్థుల ఆటల పాటల కేరింతల మధ్య జరిగాయి. ఈ కార్యక్రమంలో కేతనకొండ సర్పంచ్ నళిని విన్‌స్టన్ ముఖ్య అతిధిగా పాల్గొని విద్యార్థులకు శు భాకాంక్షలు తెలియజేశారు. మంచి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. 2021 22 విద్యా సంవత్సరంలో ఇంటర్ మరియు డిగ్రీ 15 మంది మెరిట్ విద్యార్థులకు నగదు ప్రోత్రాహకాలను అందజేశారు. యూసిసిఐ సెక్రెటరీ అండ్ కరస్పాడెంట్ ఇమ్మాన్‌యేల్‌బాబు మాట్లాడుతూ విద్యార్థులు మంచి నడవడిక అలవరుచుకోవాలని, కళాశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకువచ్చేలా చదువుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ పుల్లయ్య, స్కూల్ ప్రిన్సిపాల్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.










