- ఇన్ స్పైరింగ్ ఇన్నోవేటివ్ ఫెయిర్ ప్రారంభంలో న్యాయమూర్తి కె స్పందన
ప్రజాశక్తి-హిందూపురం : విద్యార్థులు శాస్త్ర, సాంకేతికతను పెంపొందించుకొని గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదగాలని న్యాయమూర్తి కె స్పందన పేర్కోన్నారు. శనివారం శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలోని పాంచజన్య బ్రిలీయంట్స్ స్కూల్లో ఏర్పాటు చేసిన ఇన్సెరింగ్ ఇన్నోవేటివ్ ఫెయిర్ -2023ను ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కె స్పందన, మండల విద్యాశాఖ అధికారి గంగప్ప, పాఠశాల వ్యవస్థాపక అధ్యక్షులు పాంచజన్య శ్రీనివాసులు ముఖ్య అధితులుగా పాల్గోని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రాధమిక స్థాయి నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులు రూపోందించిన సుమారు 600 ప్రయోగాలను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాల అద్యక్షులు పాంచజన్య శ్రీనివాసులు మాట్లాడుతు మానవుని యొక్క మనుగడ, అభివృద్ధి, రాబోవు తరాలకు అనుగుణంగా ప్రకృతిని కాపాడడం కోసమే విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాలను సృజనాత్మకతను వెలికి తీయడానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. రూపొందించిన ప్రాజెక్టులు సమాజానికి ఉపయోగపడలా ఉండే విధంగా విద్యార్థులకు వివరించి, వాటిని సిద్ధం చేయించి, ప్రదర్శన చేయించా మన్నారు. న్యాయమూర్తి కె స్పందన మాట్లాడుతు మారుతున్న కాలానికి అనుగుణంగా వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల ఆలోచనలకు పునాదిగా ఎంతగానో దోహదపడతాయన న్నారు. ప్రస్తుత వైజ్ఞానిక ప్రదర్శనలో పుస్తక రూపంలో ఉన్న ప్రాజెక్టు లే కాకుండా స్వతహాగా సొంత ఆలోచన విధానంతో తయారు చేసే విధంగా ఆసక్తి కలిగించడం అభినందనీయమన్నారు. విద్యార్థులు ఏర్పా టు చేసిన వివిధ ప్రాజెక్టు ప్రదర్శనలు ఎంతో అద్భుతంగా ఆకట్టుకున్నాయని, సేంద్రియ ఉత్పత్తుల ద్వారా పండించిన ధాన్యాలు, తృణధాన్యాల వాడకం, ఆరోగ్యం, గ్లోబల్ వార్మింగ్ తదితర వాటితో పాటు వివిధ పండుగల గూరించి వివరిస్తు ప్రాజెక్టులు ప్రదరింశంచడం అభినందనీయమన్నారు. ప్రజలు మూఢనమ్మకాలు, మూఢవిశ్వాసాలను పారద్రోలి శాస్త్ర సాంకేతికతను పెంపొందించుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఇలాంటి ప్రదర్శన ద్వారా విద్యార్థులలో విజ్ఞానం, మేధస్సు అభివృద్ధి చెందుతాయన్నారు. ప్రతి విద్యార్థి ఇష్టంతో కష్టపడి చదివితే అనుకున్న గమ్యాన్ని చేరడానికి సాధ్యం అవుతుందన్నారు. విద్యార్థు లు తయారు చేసిన వివిధ ప్రాజెక్టులను తిలకించడానికి వివిధ పాఠశాల విద్యార్థులతో వారు వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున వచ్చి నమూనాలను తిలకించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సెక్రటరీ నందకువ చార్, అకడమిక్ డైరెక్టర్లు స్మిత, నందిత, హెచ్ఎం గాయిత్రి, ఎఓ భాస్కర్, ఎహెచ్ఎంలు విజయేంద్ర, శశికళ, అబ్దుల్ రజాక్, సతీష్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గోన్నారు.










