Apr 19,2023 21:32

ఫొటో : ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు చూపుతున్న ఉపాధి కూలీలు

'ఉపాధి' పనులు పరిశీలన
ప్రజాశక్తి మర్రిపాడు : మండలంలోని అల్లంపాడులో జరుగుతున్న ఉపాధి హామీ పనులను బుధవారం ఇన్‌ఛార్జి ఎంపిడిఒ మస్తాన్‌ఖాన్‌ పరిశీలించారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున ఉపాధి కూలీలు ఉదయాన్నే పనులు మొదలు పెట్టి 10గంటలకు పూర్తి చేసుకొని ఇల్లు చేరుకోవాలని సూచించారు. కూలీలకు ఒఆర్‌ఎస్‌ ప్యాకెట్లు పంపిణీ చేశారు. రోజుకు రూ.272 పొందేవిధంగా కొలతలు ప్రకారం పనులు చేసుకోవాలన్నారు.
వేసవి తాపాన్ని తట్టు కొనేందుకు వీలుగా మంచినీటిని తీసుకోవాలని, వడదెబ్బకు గరైతే వెంటనే ఒఆర్‌ఎస్‌ ప్యాకెట్‌ ఒక లీటర్‌ నీటిలో వేసుకుని తాగాలని సూచించారు. అలసటకు గురైన వారు కొంచెం సేపు పనిదగ్గర ఏర్పాటు చేసిన టెంట్‌ కింద సేద తీరాలని తెలిపారు. నాణ్యతా ప్రమాణాలను పాటించి పనులు చేయాలని, ముందుగా కొలతలు తీసుకొని పనులు చేసుకోవాలని ఎపిఒ పి.సునీల్‌ కుమార్‌ కూలీలకు సూచించారు. పనిప్రదేశంలో టెంట్‌, మందు కిట్‌ బాక్స్‌ ఏర్పాటు చేసి కూలీలకు పనికల్పించే విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్న క్షేత్ర సహాయకుడు ఎన్‌.తిరుపతిని అభినందించారు.