తలవగానే చైతన్యం
తరలిపోయె తల్లితాను
పోరాడి జీవితాంతం
పద్నాలుగు ఏళ్ల వయసు
బందూకు పట్టి తాను
పీడన ఎదిరించింది
దొరల పీచమణచింది
భూస్వాముల బిడ్డయినా
బానిసలకు నాయికగా
బరిలోకే దూకింది
అరుణతార వెలిగింది
సాహసాల చిరునామా
త్యాగనిరతి చిహ్నమామె
ఆశయమే అనవరతం
మహిళ సేవ అంకితం
ఆడంబరమా తెలియదు
అట్టహాసమే ఎరుగదు
కపటం స్వార్థం తలవని
శ్రమజీవుల సమరదీప్తి
తెలంగాణ వీరమాత
తెలుగుజాతి స్పూర్తిదాత
చిరకాలం మనతోనే
పయనిద్దాం తన బాటే
-తె.ర.










