సిబ్బంది సమయపాలన పాటించాలి
ప్రజాశక్తి-సీతారామపురం : మండలంలోని సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించాలని ఎంపిడిఒ ఐజాక్ ప్రవీణ్ సూచించారు. బసినేనిపల్లి సచివాలయంలో గురువారం ఎంపిడిఒ ఐజాక్ ప్రవీణ్ ఆకస్మికంగా తనిఖీ చేసి హాజరు, మూమెంట్ రిజిస్టర్ సిబ్బంది విధి నిర్వహణ రిజిస్టర్‌లను పరిశీలించారు. ప్రతిఒక్క సచివాలయ సిబ్బంది పనివేళల్లో సచివాలయంలో అందుబాటులో ఉండాలని, బయోమెట్రిక్ అటెండెన్స్ కచ్చితంగా వేయాలని సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు అందరూ అందుబాటులో ఉండి స్పందన కార్యక్రమం నిర్వహించాలని, సచివాలయంలో సేవలను పెంచాలని, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో భాగంగా నాలుగు అంశాలకు సంబంధించి ఎస్‌డిజి సర్వే సకాలంలో పూర్తి చేయించాలని, ఆయుష్మాన్ భారత్ పూర్తిచేసి పేదలకు వైద్య సదుపాయం కల్పించడానికి అందరూ కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, వాలంటీర్స్, తదితరులు పాల్గొన్నారు.










