Apr 20,2023 22:19

ఫొటో : ఎంఎల్‌ఎ విక్రమ్‌రెడ్డిని సన్మానిస్తున్న నాయకులు

సామాన్యుడి సంక్షేమమే సిఎం లక్ష్యం
ప్రజాశక్తి-మర్రిపాడు : రాష్ట్రంలో సామాన్యుల సంక్షేమమే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం మండలంలోని చుంచులూరు సచివాలయం పరిధిలోని చుంచులూరు, కొత్తపల్లి, రాజుపాళెం గ్రామాలలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రతి కుటుంబానికి ముఖ్యమంత్రి అందించిన సంక్షేమ ఫలాల గురించి వివరించారు. ఎంఎల్‌ఎ పర్యటనలో భాగంగా కొత్తపల్లి గ్రామస్తులు 20 సంవత్సరాలుగా తాము విద్యుత్‌ సమస్యను ఎదుర్కొంటున్నామని, అనేక ప్రభుత్వాలు మారినా తమ సమస్య తీరలేదని ఎంఎల్‌ఎ దృష్టికి తీసుకురావడంతో స్పందించిన ఆయన వెంటనే అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.
ముఖ్యమంత్రి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల సమస్యలను, వారికి సంక్షేమ పథకాలను అందించేందుకు బృహత్తర ఆశయంతో సచివాలయ, వాలంటీర్‌ వ్యవస్థలను ఏర్పాటు చేశారని, అవి ప్రజలకు ఎంతగానో సేవలందిస్తున్నాయని తెలిపారు. రాజుపాలెంలో ఎంపి నిధులతో నిర్మించిన మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ ను ప్రారంభించారు. ఒక్కో సచివాలయం పరిధిలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రూ.10 కోట్ల నుండి రూ.18 కోట్ల వరకు సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి అందచేసి వారి ఆర్థికాభివృద్ధికి ప్రోత్సాహం అందిస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరూ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు. గ్రామంలో పలువురు రెవెన్యూ సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చారని, శుక్రవారం ఆత్మకూరు మున్సిపల్‌ కార్యాలయం వేదికగా జిల్లా, డివిజన్‌, మండల స్థాయి అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరూ తమ రెవెన్యూ సమస్యలను తెలుపుకుని పరిష్కరించుకోవచ్చన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్‌ సుబ్బిరెడ్డి, జెసిఎస్‌, కన్వీనర్‌ మోహన్‌ రెడ్డి, స్థానిక సర్పంచ్‌ చామంచయ, ప్రసాద్‌, వైసిపి నాయకులు ఇందూరు నర్సారెడ్డి, రాజా, మీరావలి, ప్రతాప్‌రెడ్డి రామ్మోహన్‌రెడ్డి, గంగినేని రవీంద్రబాబు, నాయకులు పాల్గొన్నారు.