పల్లవి : అడవులు ముద్దాడిన ఆయుధాల పాదమా!
తూటావై.. పాటవై కదలిన మా ప్రాణమా!
జోహారు... జోహారు మా తలపుల భాగ్యమా!
తరతరాలకు తల్లీ, తలపులోన
పూజ్యమా! .. జోహారు ..
చరణం : కాల్మోక్త బాంచననే కష్టజీవి కన్నీరు
చిన్ననాడే చూపినారు యోధులు నీ కన్నవారు
అమ్మా! నీ అత్తవారు పోరుకు శిరసెత్తినారు
కమ్యూనిస్టు భావాలకు
పతాకాలు పట్టినారు .. జోహారు ..
చరణం : నిబద్ధతకు మీరూ విలువైన రూపమూ
నీతికి, నిర్భీతికి నిలువెత్తు దీపమూ
నిరంతరం తలపుల్లో ఎంత ప్రేమ ఎరుపంటే
సొంత బిడ్డల కంటే ఎర్ర
జెండ మెరుపంటే .. జోహారు..
- నల్లి ధర్మారావు
76609 67313










