ప్రజాశక్తి -కందుకూరు :ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎం అంజిరెడ్డి, రిజిస్ట్రార్ వి.హరిబాబు ఆదేశాల మేరకు గురువారం కందుకూరు శ్రీ గాయత్రి విద్యా పరిషత్ డిగ్రీ కాలేజీ ఆవరణంలో ఫైనల్ ఇయర్ చదువుతున్న డిగ్రీ విద్యార్థులతో ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయం అధికారులు ముఖాముఖి నిర్వహించారు. 2023 -2024 ఏడాదికి పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయని, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న విద్యార్థులందరూ ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయంలో ప్రవేశపెట్టిన పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులలో అడ్మిషన్స్ పొంది విశ్వవిద్యాలయం అభివృద్ధికి సహకరించాలని కోరారు. విద్యార్థులతో జరిగిన ముఖాముఖి సమావేశంలో విశ్వవిద్యాలయం డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డాక్టర్ జి.సోమశేఖర్, విశ్వవిద్యాలయం ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రాజా మోహన్, కామర్స్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు, మాథ్స్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ ఎల్ కష్ణ, శ్రీ గాయత్రి విద్యా పరిషత్ డిగ్రీ కాలేజ్ రెస్పాండెంట్ సిహెచ్ రామకష్ణారావు పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన డాక్టర్ జి సోమశేఖర్ మాట్లాడుతూ అడ్మిషన్ల కోసం వెబ్‌సైట్‌లో ఈ నెల1 నుండి 11వ వరకు ఆన్‌లైన్‌లో పొంద వచ్చన్నారు. కందుకూరులోని శ్రీ ప్రతిభ డిగ్రీ కాలేజ్, శ్రీ వివేక డిగ్రీ కాలేజ్, టి.ఆర్ ఆర్ డిగ్రీ కాలేజ్, గాయత్రి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్స్ పాల్గొనారు.










