ముగిసిన అగ్నిమాపక వారోత్సవాలు
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్ : అగ్నిమాపక వారోత్సవాలలో ముగింపు సందర్భంగా గురువారం ఆత్మకూరు పట్టణంలోని అగ్నిమాపక కేంద్రంలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ టి.రమేష్ బాబు ఆధ్వర్యంలో వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వి.రాజారెడ్డి, ఎఎస్‌ఆర్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అగ్నిమాపక ఫైర్ ఆఫీసర్ టి.రమేష్ బాబు మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అగ్నిమాపక శాఖ సేవల గురించి విద్యార్థులకు వివరించారు. 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు వారం రోజులు పాటు పలు కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. అగ్ని ప్రమాదాలు నివారణపై అవగాహన పెంచుకోవాలని కోరారు. తదుపరి కరపత్రాలు పంపిణీ చేశారు.










