Apr 20,2023 20:13

విద్యార్థులతో మాట్లాడుతున్న ఆగ్నిమాపక సిబ్బంది

ప్రజాశక్తి -కందుకూరు :పట్టణంలోని కేసరి కుంట కాలనీలో ఉన్న అగ్నిమాపక శాఖ కేంద్ర కార్యాలయంలో అగ్నిమాపక వారోత్సవాల ముగింపు కార్యక్రమం గురువారం జరిగింది. అగ్నిమాపక కేంద్రంలో సెమినార్‌, ఫైర్‌ సర్వీస్‌ వర్క్‌ షాప్‌ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎం. గౌతమ్‌ హై స్కూల్‌ ప్రిన్సిపాల్‌ ఎం మాలకొండయ్య హాజరయ్యారు. అగ్నిమాపక శాఖ కేంద్ర కార్యాలయ అధికారి బి వెంకటేశ్వర్లు మాట్లాడారు. ప్రమాదాల నివారణకు పలు సూచనలు చేశారు. అగ్నిమాపక సిబ్బంది సిహెచ్‌ శ్రీనివాసరెడ్డి, సురేషు పాల్గొన్నారు.