Apr 21,2023 21:51

ఫొటో : మాట్లాడుతున్న డిఆర్‌డిఎ పిడి సాంబశివారెడ్డి

మరింత మెరుగైన పొదుపు సేవలు
ప్రజాశక్తి-ఆత్మకూరుఅర్బన్‌ : రాబోయే రోజుల్లో పొదుపు సంఘాలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఎన్‌ఆర్‌ఎల్‌ఎం లోకాయాప్‌ ద్వారా వీలు కలుగుతుందని డిఆర్‌డిఎ, పిడి సాంబశివారెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని వైఎస్‌ఆర్‌ క్రాంతి పథకం కార్యాలయంలో గత మూడు రోజులుగా జరుగుతున్న లోక యాప్‌పై శిక్షణ తరగతులు శుక్రవారంతో ముగిశాయి. చివరి రోజు కార్యక్రమానికి పిడి సాంబశివారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పొదుపు సంఘాలను బలోపేతం చేయనున్నట్లు పేర్కొన్నారు.
అందులో భాగంగా దేశవ్యాప్తంగా ఎక్కడ నుంచైనా పొదుపు లావాదేవీలు పరిశీలించుకునేందుకు వీలుగా ఈ యాప్‌ను రూపొందించినట్లు తెలిపారు. సెర్ప్‌ ఆధ్వర్యంలో ఆత్మకూరు డివిజన్‌ పరిధిలోని 12 మండలాల్లో ఎంపిక చేసిన ఎపిఎంలు సిసిలు, విఒఎలకు శిక్షణ తరగతులు నిర్వహించినట్లు తెలిపారు. శిక్షణ పూర్తి చేసిన వారు టిఒటిలుగా పిలవబడి ఆయా మండలాల్లో మిగిలిన సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారని తెలిపారు. మే 15 లోపల మండలాల్లో శిక్షణ పూర్తవుతుందని అప్పటినుంచి జూన్‌ 16వ తేదీ వరకు నెలరోజుల వ్యవధిలో నిబంధన మేరకు పొదుపు సంఘాలు సభ్యులు పూర్తి వివరాలు ఈ యాప్‌లో సిబ్బంది నమోదు చేయాల్సి ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఆత్మకూరు ఉదయగిరి ఏరియా కోఆర్డినేటర్లు పి.వెంకటేశ్వర్లు, జి.శేషారెడ్డి, డిఆర్‌డిఎ నుంచి శిక్షకులు పి.చిన్నయ్య, కాంతారావు, మోహన్‌ రావు, హరి, మస్తానమ్మ, ఎపిఎంలు వెంకమ్మ, బుజ్జమ్మ, వెంకట రమణమ్మ, వెలుగు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.