Apr 21,2023 21:46

ఫొటో : మాట్లాడుతున్న ఎంఎల్‌ఎ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి

కుల రాజకీయాలకు కేరాఫ్‌ 'చంద్రబాబు'
ప్రజాశక్తి-ఇందుకూరుపేట : కుల రాజకీయాలకు కేరాఫ్‌ అడ్రస్‌ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని కోవూరు ఎంఎల్‌ఎ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి ధ్వజమెత్తారు. మండలంలోని కొత్తూరు గ్రామంలో ఆయన ముఖ్య అతిథులుగా పాల్గొని గడపగడపకు మన ప్రభుత్యం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమాల గురించి వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మొదటి నుంచి కుల రాజకీయాలు చేస్తూ కులాల మధ్య చిచ్చు పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడదన్నారు. అలాంటి చంద్రబాబు నాయుడు తమ నాయకుడు జగన్మోహన్‌రెడ్డి విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు.
ముదివర్తిపాలెం కాజ్వే 20 రోజుల్లో టెండర్లు పిలుస్తామని తెలిపారు. కోవూరు టిడిపి ఇన్‌ఛార్జి పోలరెడ్డి దినేష్‌రెడ్డి సెల్ఫీ చాలెంజ్‌ విసరడం పిల్లల ఆటల వలే ఉన్నాయన్నారు. అలాగే కొత్తకాలువ నుండి కుడితిపాలెం వరకు రోడ్లు పనులు త్వరితగతిన మొదలు పెడతామన్నారు. ఇకనైనా తమపై, తమ ప్రభుత్వంపై టిడిపి నాయకులు చేస్తున్న దుష్ప్రచారాలు మానుకోవాలన్నారు. కార్యక్రమంలో వైసిపి మండల అధ్యక్షులు మావులూరు శ్రీనివాసులు రెడ్డి, డిఎల్‌డిఎ చైర్మన్‌ గొల్లపల్లి విజరుకుమార్‌యాదవ్‌, యువనేత దువ్వూరు కళ్యాణ్‌ రెడ్డి, జెడ్‌పి వైస్‌చైర్మన్‌ శ్రీహరికోట జయలక్ష్మి, సీనియర్‌ నాయకులు గూడూరు ప్రభాకర్‌ రెడ్డి, దేవిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, కైలాసం శ్రీనివాసులరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.