Apr 20,2023 22:23

ఫొటో : మాట్లాడుతున్న ఎంపిడిఒ శ్రీనివాసులు

గ్రామాల్లో సమస్యలు పరిష్కారం
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : 'గడప గడపకు మన ప్రభుత్వం' రివ్యూ సమావేశాలలో పలు సమస్యలు పరిష్కరించడం వల్ల ఆయా గ్రామాలు అభివృద్ధి జరుగుతున్నాయని ఎంపిడిఒ సి.శ్రీనివాసులు తెలియజేశారు. గురువారం మండలంలోని బోయిళ్లచిరువెళ్లలో మండల ప్రజా పరిషత్‌ అధ్యక్షులు కేతా వేణుగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రివ్యూ సమావేశంలో ఎంపిడిఒ మాట్లాడారు. గ్రామంలో 367 సమస్యలు నమోదు కాగా 270 వివిధ శాఖల సమస్యలు పరిష్కరించినట్లు తెలిపారు.
ఈ ప్రోగ్రాం కింద 6 పనులకు గానూ రూ.20 లక్షలు మంజూరయ్యాయని, వీటిలో 4 పనులు పూర్తి దశలో ఉన్నాయని, మిగిలిన 2పనులు త్వరలో ప్రారంభిస్తామని ఆయన తెలియజేశారు. సమావేశంలో సర్పంచ్‌ బోలిగర్ల వెంకటేశ్వర్లు, తహశీల్దార్‌ లక్ష్మీ నరసింహుం, సచివాలయం కన్వీనర్‌ శ్రీనివాసుల రెడ్డి, వైసిపి నాయకులు రత్నాకర్‌రెడ్డి, పిచ్చిరెడ్డి, పంచాయతీ సెక్రటరీ షేక్‌ షఫీ, విఆర్‌ఒ, సచివాలయం సిబ్బంది హాజరయ్యారు.