ప్రజాశక్తి -ఉలవపాడు :మండలంలోని రామాయపట్నం సచివాలయం పరిధిలోని నిమ్మచెట్టు దిబ్బ కాలనీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ఎంఎల్‌ఎ మానుగుంట మహీధర్ రెడ్డి గురువారం పాల్గొన్నారు. ఉదయం మంచు కురుస్తున్నప్పుడు నుంచి భగభగ మండే ఎండను సైతం లెక్కచేయకుండా ప్రతి గడప తిరుగుతూ సిఎం జగనన్న ఇస్తున్న సంక్షేమ పథకాలు గురించి వివరిస్తూ వాళ్ల సమస్యలు తెలుసుకున్నారు. వాళ్లకు ఏదైనా సమస్య ఉంటే వెంటనే పరిష్కార మార్గాలు చూపుతూ అధికారులు ఆదేశిస్తూ ముందుకు సాగినారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా గురువారం జలజీవన్ మిషన్ (జేఎంఎం) కింద మంజూరైన 38 లక్షల రూపాయల వ్యయంతో (40)వేల లీటర్ల సామర్ధ్యంతో ఇంటి ఇంటికి తాగునీరు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటుచేసిన వాటర్ ట్యాంక్‌ను ఎంఎల్‌ఎ ప్రారంభించారు. ఉలవపాడు మండల అధికారులు గ్రామ సచివాలయ సిబ్బంది, వైసిపి ఉలవపాడు మండల ఎంపిపి, వాయల మస్తానమ్మ , వైఎస్ ఎంపీపీ సయ్యద్ ఫజల్, జడ్పిటిసి అరుణమ్మ, సర్పంచ్ రాసాని గోవింద్, ఎంపీటీసీ, ఉలవపాడు మండల జేసిఎస్ కన్వీనర్ వెలిచెర్ల ధనకోటి, వెలిచర్ల చంద్రశేఖర్, వీరేపల్లి మాజీ సర్పంచ్ నన్నమ్ పోతురాజు, ఉలవపాడు మండల కోఆప్షన్ సభ్యులు ఖాదర్ బాషా ఉనాన్రు.










