Apr 20,2023 20:07

దళితుడిని పరామర్శిస్తున్న సుబ్బారావు

ప్రజాశక్తి -కందుకూరు :పెత్తందారుల చెతిలో గాయపడి కందుకూరు ఉప్పు చెరువులో తన మామ ఇంటి వద్ద నడవలేని స్థితిలో ఉన్న పోంతగాని మాల్యాద్రిని గురువారం దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరవది సుబ్బారావు పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకొన్నారు. సుబ్బారావు మాట్లాడుతూ లింగసముద్రం మండలం, మెదర్‌ మీట్ల పాలెం గ్రామనికి చెందిన పోంతగాని మాల్యాద్రి పై అదే గ్రామనికి చెందిన పెత్తందారు క్షురపాటి విజయ బాస్కర్‌ రావు కూలి పినకి కావలికి బైక్‌పై వెళ్ళుతున్న మాల్యాద్రిని రాజువారి చింతలపాలెం వద్ద అపి కులం పేరుతో దూషించి దాడి చేశారన్నారు. ఆ దాడిలో మరో ముగ్గురు పాత్ర ఉందని తెలుస్తుందన్నారు. క్షురపాటి విజయ బాస్కర్‌ రావు పై పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. బాధితుడికి న్యాయం చేయాలన్నారు. అకారణంగా దళితునిపై దాడిచేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కందుకూరు సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బి సురేష్‌ బాబు, ఏపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అద్యక్షులు దమ్ము దర్గాబాబు, రిటైర్డ్‌ వార్డన్‌ బివి వెంకటేశ్వర్లు, రాళ్ళపాడు పరిరక్షణ రైతు క్షులి సంఘం కార్యదర్శి యం సుబాన,్‌ అనందరావు ఉన్నారు.