చంద్రబాబునాయుడు జన్మదిన వేడుకలు
ప్రజాశక్తి-ఉదయగిరి : టిడిపి జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన 73 కిలోల భారీ కేకును టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మాజీ జెడ్‌పి చైర్మన్ చెంచలబాబుయాదవ్ కట్ చేశారు. గురువారం స్థానిక బస్టాండ్ సెంటర్లో మండల అధ్యక్షులు చింతనబోయిన బయన్న ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో ఉంటూ 2024లో రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించాలని ఆకాంక్షించారు. 2019 ఎన్నికల్లో ఎందుకు ఓడించామని రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారని ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలవారు చంద్రబాబు ముఖ్యమంత్రి తోనే రాష్ట్రం అన్ని విధాల ముందుకి సాగుతుందన్నారు. కార్యక్రమంలో బిసిసెల్ నియోజవర్గ అధ్యక్షులు మతకాల శ్రీనివాస్, మాజీఎంపిపి శ్రీకుర్తి రవీంద్రబాబు, నరసింహులు, మా బాషా, ఓబుల్ రెడ్డి, ప్రభాకర్ రాజు, కృష్ణారెడ్డి, నరసింహరాజు, కాన్స జాషువా, పులి సంధాని, ఆబిద్, తిరుపతి, వెంగయ్య, జల్సా శివకృష్ణ పాల్గొన్నారు.










