Apr 19,2023 21:34

ఫొటో : చలివేంద్రం ప్రారంభిస్తున్న రెడ్‌క్రాస్‌ సభ్యులు

ఆర్‌టిసిలో చలివేంద్రం ప్రారంభం
ప్రజాశక్తి-కావలి : వేసవి ఉపశమన చర్యలలో భాగంగా, కావలి ఆర్‌డిఒ వి.కె. శీనానాయక్‌ సూచనల మేరకు పట్టణంలోని పలు ప్రాంతాలలో మంచినీటి చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు కావలి రెడ్‌క్రాస్‌ కార్యదర్శి గంధం ప్రసన్నంజనేయులు తెలిపారు. బుధవారం స్థానిక డిబిఎస్‌ ఇంజనీరింగ్‌ కళాశాల యాజమాన్యం సహకారంతో, కావలి ఆర్‌టిసి బస్టాండ్‌లో మంచినీటి చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని డిబిఎస్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ టి.వి.రావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రసన్నాంజనేయులు మాట్లాడుతూ వేసవికాల విపత్తుల ఉపశమన చర్యలలో భాగంగా చలివేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు వడగాల్పుల నుంచి రక్షణ పొందడంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఆర్‌టిసి డిపో మేనేజర్‌ రాపూరు శ్రీనివాసులు మాట్లాడుతూ, సామాన్య ప్రయాణికులకు సేవలందిస్తున్న రెడ్‌క్రాస్‌, డిబిఎస్‌ ఇంజనీరింగ్‌ కళాశాల యాజమాన్యంకు అభినందనలు తెలిపారు. డి.బి.ఎస్‌.కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ టివి రావు మాట్లాడుతూ ప్రజలకు తగు సేవలందిచడంలో తమ కళాశాల యాజమాన్యం, విద్యార్థులు ముందువరసలో ఉంటారని తెలియజేశారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ ప్రతినిధులు డాకారపు రవిప్రకాష్‌, మధురాంతకం నళిని, ఓరుగంటి వెంకటేశ్వర్లు, పల్లకి.లోకేశ్వరరెడ్డి, అన్నవరం హనుమకుమార్‌, బిఎస్‌ ప్రసాద్‌, నచికేత్‌, మధుసూదన్‌ రెడ్డి, ఆర్‌టిసి అధికారులు కెవిఆర్‌ బాబు, పెంచలయ్య, పెరమన మోహన్‌రావు, కార్మిక నాయకులు పి.జనార్దన్‌ రావు, రఘునాథరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.