Apr 20,2023 20:05

వేడుకల్లో పాల్గొన్న విద్యార్థులు

ప్రజాశక్తి -కందుకూరు :స్థానిక బిఆర్‌ ఆక్సఫర్డ్‌ పాఠశాలలో ముందస్తు రంజాన్‌ వేడుకలు గురువారం నిర్వహించారు. ముస్లిం విద్యార్థులు ఖీర్‌, ఖర్జూరం తెచ్చి తోటి విద్యార్థులకు పంచిపెట్టారు. విద్యార్థులు వారందరికీ రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. మౌలానా రియాజ్‌ విద్యార్థులతో ప్రార్ధన చేయించి ఈద్‌ ముబారక్‌ తెలిపారు. 'ఆక్స్‌ఫర్డ్‌' విద్యార్థి సంస్థల చైర్మన్‌ ఉన్నం భాస్కరరావు మాట్లాడారు. విద్యార్థులంతా సోదరభావంతో మెలగాలని సూచించారు. కరస్పాండెంట్‌ బండి వెంకటేశ్వర్లు, పాఠశాల డైరెక్టర్‌ జి బాలభాస్కర్‌ ,కళాశాల డైరెక్టర్‌ జి నరేంద్రబాబు, ప్రిన్సిపాల్స్‌ ఎం రామారావు, పి మల్లికార్జున ఉన్నారు.