ప్రజాశక్తి -నెల్లూరు డెస్క్ :ఈనెల 26న విడుదలైన ఇంటర్ -2023 ఫలితాలలో కృష్ణ చైతన్య కళాశాల విద్యార్థులు విజయ దుందుభి మ్రోగించారని ఆ కళాశాల డైరెక్టర్లు ఆర్‌వి కృష్ణారెడ్డి, పి చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులను గురువారం వారు అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూనియర్ , సీనియర్ ఇంటర్ ఫలితాలలో తమ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని తెలిపారు. జూనియర్ ఎంపిసి విభాగంలో సనా ఫాతిమా 470 మార్కులకు గానూ 465 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచిందన్నారు. నిఖిల 463 మార్కులు, ధరనీష్ 462 మార్కులు సాధించారన్నారు. 460 మార్కులు పైన 10 మంది, 450 మార్కులు పైన 42 మంది విద్యార్థులు సాధించారని తెలిపారు. సీనియర్ ఎంపిసి విభాగంలో సువర్ణ 1000 మార్కులకు గానూ 987 మార్కులు సాధించి టాపర్ గా నిలిచిందన్నారు. దేవిసాయి సుష్మిత 986 మార్కులు, ఖాదర్ మస్తాన్, కతిక 985 మార్కులు, మానస 984 మార్కులు సాధించారన్నారు. 980 మార్కులకు పైన 11 మంది విద్యార్థులు, 970 మార్కులకు పైన 51 మంది విద్యార్థులు సాధించారని తెలిపారు. ప్రతి సంవత్సరం ఇంటర్మీడియట్ ఫలితాల్లో కష్ణ చైతన్య విద్యార్థులు రాష్ట్రస్థాయిలో టాపర్స్‌గా నిలిచి అధ్భుత ప్రతిభ కనబరుస్తుండటం సంతోషకరంగా ఉందని డైరెక్టర్లు ఆర్ వి కష్ణారెడ్డి ,పి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు ఈ ఫలితాలు సాధించడంలో కషిచేసిన అధ్యాపకులను, అడ్మిన్ సిబ్బందిని వారు అభినందించారు. విద్యార్థులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. పటిష్టమైన విద్యా ప్రణాళిక. అనుభవజ్ఞులైన అధ్యాపక బందం, ఒత్తిడిలోని విద్య విధానంతో ఈ ఫలితాలు సాధించలిగామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ రాణా ప్రమోద్ రెడ్డి జూనియర్ కళాశాల డీన్ సురేష్ బాబు, అకాడమిక్ డీన్ రాంగోపాల్ రెడ్డి, అడ్మిన్ పాయసం రమేష్ పాల్గొన్నారు.










