ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి
ప్రజాశక్తి-జలదంకి : మాజీ ఎంఎల్‌ఎ బొల్లినేని వెంకట రామారావు సూచనల మేరకు మండలంలోని లింగరాజు అగ్రహారం పంచాయతీలో టిడిపి నేతలు ఆదివారం ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల నాయుకులు ఇంటింటికీ తిరిగి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారికి ప్రభుత్వ వైఫల్యాలను వివరించారు. ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏమి కొనేటట్టు, తినేటట్టు లేవన్నారు. జగన్ పాలనలో ప్రజలకు భద్రత లేదన్నారు. నిత్యావస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పులుగుంట మధుమోహన్ రెడ్డి, పార్లమెంట్ ఉపాధ్యక్షులు వంటేరు జయచంద్ర రెడ్డి, కొరపాటి రామారావు, క్లస్టర్ ఇన్‌ఛార్జులు మందపల్లి మాల్యాద్రి, గుర్రం ప్రవీణ్, ఉదయగిరి నియోజకవర్గ ఎస్‌సిసెల్ ప్రధాన కార్యదర్శి ఉప్పుటూరు సుధీర్ బాబు, జలదంకి మండల ఎస్‌సిసెల్ అధ్యక్షులు ఏగూరి రఘు, మండల ఉపాధ్యక్షులు కంచర్ల వినోద్ నాయుడు, మదన్, శెట్టిపల్లి బాలకోటయ్య, యూనిట్, బూత్ ఇన్‌ఛార్జి పాల్గొన్నారు.










