బక్రీద్ సందర్భంగా బుధవారం సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద మిఠాయిలు పంచుకుని పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్న భారత్, పాక్ జవాన్లు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ : బక్రీద్ సందర్భంగా భారత్, పాక్ సరిహద్దులో అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. సామరస్యత, సుహృద్బావానికి ప్రతీకగా ఇరు దేశాలకు చెందిన జవాన్లు పరస్పరం మిఠాయిలు పంచుకుని ఈద్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. జమ్ము కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి పూంచ్-రావల్కోట్, మెన్ధార్-హాట్‌స్ప్రింగ్ క్రాసింగ్ పాయింట్ల వద్ద ఇరు పక్షాల సైన్యం మిఠాయిలు ఇచ్చిపుచ్చుకున్నాయని ఆర్మీ ప్రో లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ ఆనంద్ తెలిపారు. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ నేపథ్యంలో మెరుగైన విశ్వాసాన్ని, శాంతి, సామరస్యాన్ని పెంపొందించే చర్యగా దీనిని భారత ఆర్మీ అధికారులు పేర్కొన్నారు.










