Nov 11,2020 07:11

యాంత్రిక జీవనంలో చిరు వ్యాపారాలు చేసుకునేవారికి ద్విచక్ర వాహనాలే ఆధారం. వాహనం నడవాలంటే పెట్రో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వాహనాల నుండి వెలువడే వాయు, శబ్ద కాలుష్యం మూలంగా ప్రజలతోపాటు పశుపక్ష్యాదుల ఆయుష్షు హరించుకు పోతోంది. జరుగుతున్న ముప్పును గ్రహించి విద్యుత్‌ వాహనాలు (ఈ-వాహనాలు) ప్రోత్సహించే విధంగా ప్రభుత్వాలు ప్రయత్నించాలి. విద్యుత్‌ వాహనాలు అయితే అతి తక్కువ ఖర్చుతో ఎటువంటి వాయు, శబ్ద కాలుష్యం లేకుండా నడుపుకోవచ్చు. అంతకు మించి పెట్రో ఉత్పత్తులకు మన దేశ ఖజానా నుండి భారీ మూల్యం చెల్లించే దుస్థితి నుండి గట్టెక్కవచ్చు. ద్విచక్ర వాహనాల ధరలు సామాన్యునికి అందుబాటులో ఉండేందుకు ప్రభుత్వాలు కార్యాచరణ రూపొందించాలి.
- యర్రమోతు ధర్మరాజు, ధవళేశ్వరం.