Apr 07,2023 19:16

మీటర్‌ సినిమా విడుదల సందర్భంగా కేక్‌ కట్‌ చేస్తున్న అభిమానులు

ప్రజాశక్తి-పీలేరు : హీరో కిరణ్‌ అబ్బవరం నటించిన మీటర్‌ సినిమా విడుదల సందర్భంగా శుక్రవారం పీలేరులో అభిమానులు హంగామా చేశారు. థియేటర్లో హీరో కిరణ్‌ అభిమాన సంఘ సభ్యులు సందడి చేశారు. థియేటర్‌ ముందు టపాకాయలు కాల్చి 15 కిలోల కేక్‌ కట్‌ చేసి కిరణ్‌ అబ్బవరం అభిమానులకు, ప్రేక్షకులకు పంచి పెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కిరణ్‌ అబ్బవరం అన్నమయ్య జిల్లా ముద్దు బిడ్డని, అతను హీరోగా నటించిన ఎస్‌ఆర్‌ కళ్యాణ మండపం, వినారో భాగ్యము విష్ణుకథ సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి గుర్తింపు పొందాయని పేర్కొన్నారు. తెలుగు సినిమా రంగంలో ఒక మంచి నటుడు జిల్లా నుండి కూడా రావడం తమకెంతో ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో కిరణ్‌ అబ్బవరం అభిమాన సంఘం నాయకులు పులి సత్యనారాయణరెడ్డి, ధనుష్‌రెడ్డి, రాంప్రసాద్‌రెడ్డి, శివారెడ్డి, ప్రతాప్‌రెడ్డి, అమర్నాథరెడ్డి, ఆదినారాయణరెడ్డి, సినిమా థియేటర్‌ యాజమాన్యం సాంబశివా రెడ్డి, మేనేజర్‌ ధర్మేంద్ర, బాబు పాల్గొన్నారు.