Sep 27,2023 22:46

  • మారథాన్‌ రన్‌ను ప్రారంభించిన కలెక్టర్‌ డిల్లీరావు

ప్రజాశక్తి-హెల్త్‌ యూనివర్శిటీ: ఎయిడ్స్‌ మహమ్మారి పట్ల ప్రతి ఒక్కరూ ముఖ్యంగా యువత అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు. జిల్లా ఎయిడ్స్‌ కంట్రోల్‌ సోసైటీ ఆధ్వర్యంలో బుధవారం నగరంలో 5కె, 3కె యూత్‌ ఫెస్ట్‌ మారథన్‌ రన్‌ మీసాల రాజారావు బ్రిడ్జ్‌ సర్కిల్‌ వద్ద కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎయిడ్స్‌ వ్యాధి పట్ల యువతలో అవగాహన పెంచాలన్నారు. ఈ వ్యాధి బారిన పడకుండా ముఖ్యంగా యువత జాగ్రత్త వహించాలన్నారు. ప్రస్తుత రోజులలో ఎయిడ్స్‌ వ్యాధి గ్రస్తులకు అత్యాధునిక వైద్యం, మందులు అందుబాటులో ఉన్నాయని వాటి వల్ల వారు ఆరోగ్యంగా జీవిస్తున్నారన్నారు. అనంతరం 5కె, 3కె రన్‌లో విజేతలకు నగదు బహుమతులను ప్రశంసా పత్రాలను కలెక్టర్‌ డిల్లీరావు అందజేశారు. 5కె రన్‌లో ప్రధమ బహుమతి పొందిన పైడిరాజుకి రూ.5 వేలు, ద్వితీయ బహుమతి జి తరుణ్‌ కుమార్‌కు రూ.3 వేలు, తృతీయ బహుమతి పొందిన ఎస్‌కె బాజీ రూ.2,500, తేజ్‌రామ్‌, సాయిమనోజ్‌లకు వెయ్యి రూపాయలు ప్రోత్సహక బహుమతిగా అందజేశారు. 3కె రన్‌లో ప్రధమ బహుమతి బి.కరుణశ్రీ రూ.5 వేలు, ద్వితీయ బహుమతి వి.హన్నా రూ.3 వేలు, తృతీయ బహుమతి ఆర్‌.రమ్య రూ.2,500, హిమబిందు, పృతి కీర్తనకు వెయ్యి రూపాయలు ప్రోత్సహక బహుమతిగా అందజేశారు. ఈ కార్యక్రమంలో డియంఅండ్‌ హెచ్‌వో డా. యం సుహాసిని, జిల్లా లెప్రసీ ఎయిడ్స్‌ టిబి కంట్రోలింగ్‌ ఆఫీసర్‌ డా. జి.ఉషారాణి, ఎస్‌ఆర్‌ఆర్‌ అండ్‌ సివిఆర్‌ ఫిజికల్‌ డైరెక్టర్‌ యుగంధర్‌, జిల్లా స్పోర్ట్స్‌ చీఫ్‌ కోచ్‌ అజీజ్‌, ఎయిడ్స్‌ ప్రోగ్రాం జిల్లా మేనేజర్‌ పి. కిరణ్‌, సూపర్‌వైజర్‌ ప్రశాంతి చౌదరి పాల్గొన్నారు.