Feb 28,2023 20:55

మాట్లాడుతున్న డాక్టర్‌ ఎంవి రమణయ్య


మాట్లాడుతున్న డాక్టర్‌ ఎంవి రమణయ్య
ఘనంగా జాతీయ సైన్స్‌ దినోత్సవ వేడుకలు
నెల్లూరు :నగరంలోని పలు పాఠశాలల్లో జాతీయ సైన్స్‌ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం ఈ వేడుకల్లో భాగంగా విద్యా వైజ్ఞానిక సదస్సులు నిర్వహించడమే కాకుండా విద్యార్థులు చేసిన నమూనాల ప్ర్రయోగాలను ప్రదర్శించారు. వెంకటాచలం మండలం, కసూమూరు గ్రామానికి చెందిన జిల్లా ప్రజా పరిషత్త్‌ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్‌ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అద్యక్షులు డాక్టర్‌ ఎంవి రమణయ్య పాల్గొన్నారు. జాతీయ సైన్స్‌ దినోత్సవ వేడుకల్లో భాగంగా విద్యార్ధిని విద్యార్దులు నమూనాలను ప్రదర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యజీవితంలో 'మన విశ్వాసాలు.. వాటి వెనుక దాగిన వాస్తవాలు' అన్న అంశంపై సూదీర్ఘంగా ప్రసంగించారు. అనంతరం విద్యార్దుల అనుమానాలను నివృత్తి చేశారు. ఈ వేడుకల్లో చివరగా కళాకారులు పార్వతీశం, నాగరాజు ల సహకారంతో 'తోలుబొమ్మల' ప్రదర్శనతో ఆరోగ్య విషయాలను విద్యార్దులకు వివరించారు.ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు జివి శేషయ్య అధ్యక్షత వహించారు. వ్యాసరచన, క్వీజ్‌ పోటీలల్లో ప్రతిభను కనపరిచిన విద్యార్ధిని విద్యార్ధులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.

శేషు ఇంగ్లీషు మీడియం స్కూల్‌లో..
బుజ బుజ నెల్లూరు ప్రాంతంలోని శేషు ఇంగ్లీష్‌ మీడియం స్కూల్లో జాతీయ సైన్స్‌ దినోత్సవం సందర్భంగా విద్యా వైజ్ఞానిక సదస్సు నిర్వహించారు. పిల్లలు చేసిన నమూనాలు ప్రయోగాలు చూపర్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలాగే చుట్టుపక్కల ఉన్న పాఠశాల నుండి కూడా వచ్చి అన్నిటిని తిలకించి విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా స్కూల్‌ కరస్పాండెంట్‌ శేషు మాట్లాడుతూ సివి రామన్‌ను నేటితరం విద్యార్ధులందరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపు నిచ్చారు. ప్రతిభకు పేదరికం అడ్డు రాదని సివి రామన్‌ నిరూపించారన్నారు. అనంతరం పిల్లలందరికీ క్విజ్‌ పోటీలు కూడా నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్కూల్‌ కరస్పాండెంట్‌ శేషు ఉపాధ్యాయులను పిల్లలందరినీ అభినందించారు.