ప్రజాశక్తి - లింగసముద్రం :దత్తాత్రేయ స్వామి ఆరాధన మహోత్సవం వైభవంగా జరిగింది. మూడు రోజులు పాటు జరిగిన ఈ ఆరాధన మహోత్సవానికి యాత్రికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వారు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తగిన ఏర్పాట్లు చేశారు. గురువారం తెల్లవారు జామునుంచి యాత్రికుల కోలాహలంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. 41 రోజులు పాటు మండల పూజ, మాలధారణ, అర్ధ మండల పూజ, మాలధారణ ధీక్షలు చేపట్టిన భక్తులు, వారి బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొని దీక్షా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. భక్తులకు ఆలయ ధర్మకర్త పవని నాగేంద్రప్రసాద్ ఏర్పాట్లు చేశారు. ప్రకాశం, నెల్లారు జిల్లాల నుంచే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు హాజరై దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్నారు. దీక్షలు చేపట్టిన వారు చేపట్టి పొంగళ్లు పెట్టారు. కందుకూరు, కావలి డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడిపారు. మొగిలిచర్ల యాదవ సంఘం ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. గుడ్లూరు సిఐ సుబ్బారావు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. . లింగసముద్రం ఎస్‌ఐ ఆవుల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఐదుగురు ఎస్‌ఐలు, 50మంది సిబ్బందితో బందోబస్త్‌ను పర్యవేక్షించారు.










