ప్రజాశక్తి - హెల్త్ యూనివర్సిటీ : సేవా దక్పథంతో విశిష్ట వైద్యాన్ని అందించాలనే సంకల్పంతో విధాత హాస్పిటల్ రూపుదిద్దుకుంది. విశేష అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు, ప్రపంచ శ్రేణి సాంకేతిక వసతులతో ప్రాణదాతగా నిలిచే విధాత హాస్పిటల్‌ను రాష్ట్ర గవర్నరు ఎస్.అబ్దుల్ నజీర్ ఆదివారం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం గురించి తెలియ జేసేందుకు మొగల్రాజపురంలోని విధాత హాస్పిటల్లో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ బి.చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఆధునిక వైద్య సేవలను అందరికీ అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా విధాత హాస్పిటల్‌ను నెలకొల్పామని అన్నారు. లాభాపేక్ష లేకుండా అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందిస్తామని తెలిపారు. గ్యాస్ట్రో, లివర్, ప్యాంక్రియాస్ అడ్వాన్స్డ్ లాపరోస్క్రోపిక్, బేరియాట్రిక్ సర్జరీలు, జనరల్ మెడిసిన్, అన్ని రకాల జ్వరాలు, షుగర్, బీపీ, పాముకాటు, పాయిజనింగ్ కేసులు, ఆస్తమా, టిబి, ఊపిరితుత్తులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, అత్యాధునిక గైనకాలజి ఆపరేషన్లు, లాపరోస్ట్రోపిక్, ట్యూబల్ రీకనలైజేషన్, యాక్సిడెంట్, ట్రామా, ఆర్థోపెడిక్, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు, మూత్రపిండాల వ్యాధులకు ఆపరేషన్లు, కిడ్నీ స్టోన్స్, సర్జరీలు, అన్ని రకముల యూరాలజి వైద్య సేవలు, న్యూరో, న్యూరో సర్జరీ వైద్య సేవలు, ఎమర్జన్సీ సేవల కోసం ఎనస్తీషియాలజిస్ట్, జనరల్ ఫిజీషియన్ల పర్యవేక్షణలో 24 గంటల ఐసీయు, ఎండోస్కోపి, కొలనోస్కోపి, బ్రాంకోస్కోపి, ఈఆర్సీపీ స్లీప్ స్టడీ, పల్మనరి ఫంక్షన్ టెస్టులు అందుబాటులో ఉంటాయని వివరించారు. ఈ సమావేశంలో డాక్టర్ కొడాలి వెంకట ఉమాకాంత్, డాక్టర్ కె. యుగంధర్, డాక్టర్ ఎల్. పద్మజ పాల్గొన్నారు.










