పాటల క్యాసెట్‌ను విడుదల చేస్తున్న అచ్చెన్నాయుడు
మురళీ మోహన్ రాజు రచించిన
''గరళంపై యువగళం'' పాట విడుదల
నెల్లూరు:బి.సి.ఐక్య కార్యాచరణ రౌండ్ టేబుల్ సమావేశం సందర్బంగా తెలుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం నెల్లూరు లోని కస్తూరిదేవి గార్డెన్స్ నందు యువకవి కె.మురళీమోహన్ రాజు రచించిన 'గరళంపై యుగళం' పాటను టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చం నాయుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, మీదుగా విడుదల చేశారు. ఈసందర్బంగా టిడిపికి అద్భుతమైన పాటకు రచించిన మురళీమోహన్ రాజును అభినందించారు. ఈపాటకు ఎన్.ఆర్. చైతన్య కుమార్ సంగీతం అందించగా, డి.నవీన్ గాయకులుగా వ్యవహారించారు. ఈకార్యక్రమంలో బి.సి.సాధికార భట్రాజు రాష్ట్ర కన్వీనర్ ప్రత్తి గుడుపు ప్రసన్న ఆంజనేయుల రాజు, నెల్లూరు, ఒంగోలు, చిత్తూరు, తిరుపతి, రాజంపేట నియోజకవర్గాల పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.










