Oct 22,2023 22:04

గ్రామ స్వరాజ్యమే ధ్యేయం పల్లెలకు మౌలిక వసతులు కల్పనకు కృషి జిపిఓ ఆదం రాజశేఖర్‌రెడ్డి

గ్రామ స్వరాజ్యమే ధ్యేయం

పల్లెలకు మౌలిక వసతులు కల్పనకు కృషి
జిపిఓ ఆదం రాజశేఖర్‌రెడ్డి

ఇంటర్వ్యూ
ప్రజాశక్తి-తిరుపతి సిటి
గ్రామ స్వరాజ్యమే ధ్యేయంగా ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేస్తే, లక్ష్యాలను అందుకునేందుకు నిత్యం కృషి చేస్తున్నామని, ప్రతి పల్లెకు మౌలిక వసతులు కల్పనకు కట్టుబడి ఉన్నామని జిల్లా గ్రామపంచాయతీ అధికారి ఆదం రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్‌లో తనను కలిసిన 'ప్రజాశక్తి'తో ఆయన పలువిషయాలు వెల్లడించారు.
ప్రజాశక్తి: తిరుపతి కొత్త జిల్లాలో మీరు గమనించిన అంశాలు?
జిపివో: తిరుపతి కొత్త జిల్లాలో నెల్లూరు నుంచి విడిపోయిన కొన్ని మండలాలు కలిశాయి. ఎక్కువుగా షీ సోర్సు ఉంది, 6 పంచాయతీలు పూర్తిగా దానికి కిందకి వస్తోంది. అక్కడ అబివృద్ధి చేయాలంటే కొంత ఇబ్బందులు ఉన్నాయి. ఏపని చేపట్టాలన్నా ప్రత్యేక అనుమతులు అవసరం, తడ సమీపంలోని ఇరకం పంచాయతీ ఒక దీవి. తడ నుంచి బోటులో 10 నిమిషాలు ప్రయాణించాలి. అక్కడ కూడా ప్రత్యేకంగా కొత్త పనులు చేపట్టలేకపోతున్నాం. కనీసం అక్కడ రోడ్లు కూడా నిర్మించేందుకు అనుమతి ఇవ్వరు.
ప్రజాశక్తి : కృష్ణపట్టణం పోర్టు ద్వారా ఆదాయ వనరులు ఉన్నాయా?
జిపివో: కృష్ణపట్టణం పోర్టు జిల్లాకు ఆనుకునే ఉంది. సరిగ్గా పోర్టు భూముల సమీపం వరకు జిల్లా విభజన జరిగింది. పోర్టుకు సంబంధించిన అన్ని ప్రాంతాలు, భూభాగం మొత్తం నెల్లూరు జిల్లా పరిధిలో ఉన్నాయి. కనుక తిరుపతి జిల్లాకు ప్రత్యేకంగా ఆదాయ వనరులు పోర్టు ద్వారా వచ్చే అవకాశం లేదు.
ప్రజాశక్తి : శ్రీసిటిలోని గ్రామాల పరిస్థితి?
జిపివో: శ్రీసిటి మంచి పారిశ్రామిక వాడ. దీని వల్ల లక్షలాది మందికి ప్రత్యేక్షంగా, పరోక్షంగా ఉపాధి కలుగుతోంది. శ్రీసిటి పరిధిలో కొన్ని గ్రామ పంచాయతీలకు చెందిన గ్రామాలున్నాయి. అక్కడ అభివృద్ధి రోడ్డు వేయడం, వీధులైట్ల ఏర్పాటు తదితరవన్ని శ్రీసిటి నిర్వహకులే కల్పిస్తున్నారు. ఇంటి పన్ను వసూల్లు మినహా అక్కడ నుంచి పంచాయతీకి ఎలాంటి ఆదాయం రాదు. శ్రీసిటి అభివృది వల్ల సమీపలోని తడ పంచాయతీలో అపార్టుమెంటు నిర్మాణాలు, హోటళ్లు, వివిధ రకాల షాపులు ఏర్పాట్లు పెరిగింది. వీటి ద్వారా పంచాయతీకిక అధిక ఆదాయం వస్తోంది.
ప్రజాశక్తి: జిల్లాలో గ్రామ పంచాయతీలకు సంబంధించిన సమాచారం?
జిపివో: కొత్తగా ఏర్పడిన తిరుపతి జిల్లాలో తిరుపతి, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, గూడురు నాలుగు డివిజన్‌ పంచాయతీ కార్యాలయాలు, 33 మండలాలు, 486 సెక్రటేరియట్‌లు, 16 మేజరు పంచాయతీలు, 758 మైనర్‌ పంచాయతీలు కలిపి 774 పంచాయతీలు. 2011 జనాభ లెక్కల ప్రకారం 3982 ఆవాసాలు, 408177 గృహాలు, 14,51,608 మంది జనాభా, 745 మంది సర్పంచ్‌లు, 4021 మంది వార్డు సభ్యులు ఉన్నారు.
ప్రజాశక్తి: 2023-24 నిధులు వివరాలు?
జిపివో: జిల్లాలోని 774 గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులకు 2023-24 ఆర్ధిక సంవత్సరంలో 6,79,76,688 రూపాయలు నిధులు ఇప్పటివరకు ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో తలసరి గ్రాండ్‌ రూ.57,48,432, సినరేజ్‌ గ్రాంట్‌ రూ.2,43,55,528, వృత్తి పన్ను 1,00,06,808, సర్పంచుల గౌరవ వేతనం రూ.2,78,64,000, షెడ్యూల్‌ కులాల ప్రాంతాల్లో లైబ్రరీ ఏర్పాటుకు రూ.1,920 విడుదలయ్యాయి, వాటిని వివిధ రకాల పనులకు వెచ్చిస్తున్నాం.
విలేకరి : జిల్లాలో జగన్న స్వచ్చ సంకల్పం అమలు తీరు?
జిపివో: జిల్లాలో జగన్న స్వచ్చ సంకల్పం పథకాన్ని 2021 అక్టోబరు 2న వంద రోజుల ప్రోగ్రామ్‌గా ప్రారంబించాం. ఇందులో బాగంగా ఇప్పటి వరకు 630 గ్రామ పంచాయతీలో సాలిడ్‌వెల్త్‌ ప్రాససింగ్‌ సెంటర్‌లను నిర్మించాం. అందులో 599 సాలిడ్‌ వెల్త్‌ ప్రాజసింగ్‌ సెంటర్లో వాడుకలో ఉన్నవి. 2172 మంది క్లాప్‌ మిత్రులు ప్రతి ఇంటి నుండి తడి, పొడిచెత్త సేకరణ పనులు చేస్తున్నారు. సాలిడ్‌ వెల్ల్‌ ప్రాససింగ్‌ సెంటర్లలో తడి, పొడి చెత్తలు వేరు చేసి, సేంద్రియ ఎరువుగా తయారు చేసి, గ్రామ పంచాయతీకి ఆదాయం సమకూర్చుతోంది. పంచాయతీ కార్యదర్శి వారంలో మూడు రోజులు తప్పనిసరిగా పీల్డ్‌ విజిట్‌ చేస్తున్నారు.
ప్రజాశక్తి: మనం-మన పరిశుభ్రతలో సరఫరా చేసిన పరికరాల వివరాలు?
జిపివో: జిల్లాలోని 774 గ్రామ పంచాయతీలకు గాను 630 పంచాయతీల్లో సాలిడ్‌ వెల్త్‌ ప్రాసెసింగ్‌ సెంటర్లను నిర్మించాం. అందులో 599 సెంటర్లు వాడకంలో ఉన్నాయి, కొత్తగా 126 సెంటర్లు మంజూరయ్యాయి, ఇంకా 18 సెంటర్లు మంజూరు కావాల్సి ఉంది. 1560 ట్రై సైకిల్స్‌, 739 ఇన్సునేటర్స్‌్‌, 43 డిజిల్‌ ఆటోలు, 232 ఈ-ఆటోలు, 62 ట్రాక్టర్లును మనం-మన శుభ్రతలో భాగంగా సరఫరా చేశాం.
ప్రజాశక్తి: గ్రామాల అబివృద్ధికి మీరిచ్చే సలహా?
జిపివో: ప్రతిగ్రామానికి మౌలిక వసతులు కల్పించేందుకే అధికార యంత్రాంగం, సిబ్బంది ఉండేది. ఆయా ప్రాంతాల్లోని సమస్యలను పసిగట్టి వాటిని పరిష్కరింప చేసేందుకే గ్రామస్థాయిలో ప్రజాప్రతినిధులు ఉన్నారు. అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకెళ్లుతూ ప్రతి గ్రామాన్ని అభివృద్ధి ముందు వరసులో నిలపేలా కృషి చేయాలని ప్రతి పౌరుడికి, ప్రతిగ్రామానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వేగవంతంగా చేర్చేందుకు, సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తూ, ప్రతి ఒకరికి తన సహాయ సహాకారాలు అందిస్తాను. గాంధీ కలలు కన్న గ్రామస్వరాజ్య స్థాపనకు ప్రతి ఒకరు సహకరించాలి.