Nov 11,2021 06:53

కరోనా వైరస్‌ పుణ్యాన పిల్లల చదువులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇది చాలదన్నట్టు...రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న పలు వివాదాస్పద నిర్ణయాల వలన విద్యారంగం పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. గత మూడు సంవత్సరాలుగా ఉపాధ్యాయ పోస్ట్‌లను భర్తీ చేయటంలేదు. ఆపైన ఆంగ్ల మాధ్యమం లోనే విద్యాబోధన జరపాలన్న నిబంధన ఆచరణ సాధ్యమేనా? ఇంతవరకు పుస్తకాల పంపిణీ పూర్తి కాలేదు. మరోవైపు ఎయిడెడ్‌ విద్యాసంస్థల సమస్యపై అటు ఉపాధ్యాయులు, విద్యార్థులు కూడా ఆందోళనలతో రోడ్లపైకి వస్తున్నారు! ఇది ఏ మాత్రం వాంఛనీయ పరిణామం కాదు. విద్యారంగం వివాదాల సుడిగుండంలో చిక్కుకుంటే విద్యార్థుల భవిష్యత్తు దెబ్బ తింటుంది. ప్రభుత్వం విద్యారంగ నిపుణులు, మేధావుల సలహాలు, సూచనలు స్వీకరించి వివాదాలకు తెర దించి విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలి!

- గరిమెళ్ళ రామకృష్ణ,
ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా.