Dec 26,2022 22:22

మాట్లాడుతున్న అధికారులు

మాట్లాడుతున్న అధికారులు
గడపగడపకు మన ప్రభుత్వం
కొడవలూరు:బుచ్చి నగరపంచాయతీ 03 వార్డు కౌన్సిలర్‌ డాక్టర్‌ అందే ప్రత్యూష వార్డు సచివాలయ వెల్ఫేర్‌, కార్యదర్శులు, వలీంటర్లతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మౌలిక సదుపాయాల కల్పన తో పాటు రేషన్‌ కార్డులు, వద్ధాప్య పింఛన్లు, రేషన్‌ పంపిణీ, ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణాలు తదితర సంక్షేమ పథకాల గురించి వారితో చర్చించడం జరిగింది.అనంతరం వార్డులో 27 వ తేదీ జరగనున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పై సమీక్ష నిర్వహించారు
.ఈ సందర్భంగా కౌన్సిలర్‌ మాట్లాడుతూ ఎక్కడైనా సమస్యలు ఉంటే గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.